ప్రియా ఫుడ్స్‌కు ఎన్‌ఎస్‌ఎస్‌వో కితాబు

జాతీయ శాంపిల్‌ సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) ఉన్నతాధికారుల బృందం కృష్ణా జిల్లా పోరంకిలోని ప్రియా ఫుడ్స్‌ కార్యాలయం, ఉత్పత్తుల యూనిట్‌ను శుక్రవారం సందర్శించింది.

Updated : 24 Feb 2024 05:58 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: జాతీయ శాంపిల్‌ సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) ఉన్నతాధికారుల బృందం కృష్ణా జిల్లా పోరంకిలోని ప్రియా ఫుడ్స్‌ కార్యాలయం, ఉత్పత్తుల యూనిట్‌ను శుక్రవారం సందర్శించింది. ఇక్కడ తయారవుతున్న ఆహారోత్పత్తులు, వాటి గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ యూనిట్లు, ఉపాధి అవకాశాలు, సదుపాయాలు, పరిశుభ్రత, సౌకర్యాలు, ఇతర విభాగాలను అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌సీ డి.మాలిక్‌, డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.కిరణ్‌కుమార్‌, డైరెక్టర్‌ ఎంజే శామ్యూల్‌ పరిశీలించారు. ఉత్పత్తుల తయారీ విధానాలతో పాటు ఇతర అంశాలను ప్రియా ఫుడ్స్‌ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌ఎన్‌ ప్రసాద్‌ వారికి వివరించారు. అనంతరం మాలిక్‌ మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలు, ఆరోగ్యకరమైన వాతావరణంలో చేపడుతున్న ఉత్పత్తుల తయారీ విధానాలు బాగున్నాయని ప్రియాఫుడ్స్‌ అధికారులు, సిబ్బందిని అభినందించారు. దేశ వ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై తమ బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందన్నారు. ప్రియా ఫుడ్స్‌ కార్యాలయాన్ని సందర్శించిన వారిలో ఎన్‌ఎస్‌ఎస్‌వో ఉన్నతాధికారులు వై.గాంధీÅ, రాజేంద్రకుమార్‌ తదితరులు కూడా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని