పంటలు ఎండిపోతున్నాయ్‌.. విద్యుత్తు సరఫరా చేయండి

విద్యుత్తు సరఫరా నిలిపివేస్తుండటంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం యర్రసామంతవలస సబ్‌స్టేషన్‌ పరిధిలోని 30 గ్రామాలకు చెందిన వంద మంది రైతులు ఏఈ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

Published : 24 Feb 2024 04:47 IST

పార్వతీపురం మన్యం జిల్లాలో రైతుల ఆందోళన

మక్కువ, న్యూస్‌టుడే: విద్యుత్తు సరఫరా నిలిపివేస్తుండటంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం యర్రసామంతవలస సబ్‌స్టేషన్‌ పరిధిలోని 30 గ్రామాలకు చెందిన వంద మంది రైతులు ఏఈ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం నాలుగు గంటలు కూడా సక్రమంగా విద్యుత్తు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మొక్కజొన్న, ఆయిల్‌పాం, ఇతర పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. నిరంతరం లైన్లు ట్రిప్‌ అవుతుండటంతో వ్యవసాయ బోర్లు కాలిపోతున్నాయని, మరమ్మతులకు రూ.వేలల్లో ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే బైఠాయించారు. విద్యుత్తు వినియోగం పెరగడంతో కొన్ని గంటలు తగ్గించాల్సి వస్తుందని సబ్‌ ఇంజినీర్‌ శివశంకర్‌ తెలిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పది రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని