గోవిందా.. ఇది అపచారం కాదా?

తిరుపతిలో స్వామి సేవలో తరలించాల్సిన తితిదే ఉద్యోగుల్లో కొందరు సంస్థ ఛైర్మన్‌ సేవలో పునీతమవుతున్నారు.

Updated : 24 Feb 2024 08:12 IST

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: తిరుపతిలో స్వామి సేవలో తరలించాల్సిన తితిదే ఉద్యోగుల్లో కొందరు సంస్థ ఛైర్మన్‌ సేవలో పునీతమవుతున్నారు. ఆయన అడుగులకు మడుగులొత్తుతూ.. పూలు చల్లుతూ.. మంగళ వాయిద్యాలు వాయిస్తూ.. వైకాపా రంగుల పూలమాలలతో ఆహ్వానం పలకడం విశేషం. స్వామికి సేవ చేయాల్సిన ఉద్యోగులు ఇలా చేయడంపై ‘ఇదేమి వైపరీత్యం శ్రీనివాసా.. గోవిందనామాలు వినిపించాల్సిన ప్రదేశంలో ఈ వ్యక్తి జపం ఏమిటంటూ భక్తులు బుగ్గలు నొక్కుకుంటున్నారు. శుక్రవారం తిరుపతిలోని తితిదే పరిపాలన భవనంలో ఛైర్మన్‌, ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డికి ఉద్యోగులు ఇలా ఆత్మీయ సన్మానం నిర్వహించి పులకించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని