భారత్‌లో పట్టణీకరణ పెరుగుదల

అమెరికాకు చెందిన వివిధ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నాయని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ తెలిపారు.

Updated : 24 Feb 2024 06:00 IST

యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: అమెరికాకు చెందిన వివిధ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నాయని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) విశాఖ జోన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ‘డెస్టినేషన్‌ విశాఖపట్నం.. ది గ్రోత్‌ హబ్‌ ఆఫ్‌ ఇండియా’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ‘భారత్‌లో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. గత పదేళ్లలో ఇక్కడి నగరాల్లో 100 మిలియన్ల ప్రజలు కొత్తగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రాబోయే పదేళ్లలో ఆ సంఖ్య 200 మిలియన్లకు చేరుతుంది. భారత్‌, అమెరికా సంయుక్తంగా మరికొన్ని వారాల్లో ఏపీ నుంచి ‘నిసార్‌’ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. దేశంలో తూర్పు తీరానికి విశాఖపట్నం ఆర్థికశక్తిగా ఎదగనుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్‌, సీఐఐ ఏపీ ఛైర్మన్‌ డా.ఎం.లక్ష్మీప్రసాద్‌, సీఐఐ విశాఖ ఛైర్మన్‌ పీపీ లాల్‌కృష్ణ, వైస్‌ ఛైర్మన్‌ గ్రంథి రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు