Tirupati: ఎమ్మెల్యే గారూ.. ఇంత అన్యాయమా?భూకబ్జాలపై ప్రవాస భారతీయురాలి ఆవేదన

తన స్థలాన్ని ఓ వైకాపా నేత కబ్జా చేశాడని, దానికి తిరుపతి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు వత్తాసు పలుకుతున్నారని సునీత అనే ప్రవాస భారతీయురాలు శుక్రవారం విడుదల చేసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం తిరుపతిలో తీవ్ర దుమారం రేపుతోంది.

Updated : 24 Feb 2024 07:48 IST

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: తన స్థలాన్ని ఓ వైకాపా నేత కబ్జా చేశాడని, దానికి తిరుపతి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు వత్తాసు పలుకుతున్నారని సునీత అనే ప్రవాస భారతీయురాలు శుక్రవారం విడుదల చేసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం తిరుపతిలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన సునీత దంపతులకు తిరుపతిలోని కైకాలచెరువు గ్రామ లెక్కదాఖలా సర్వే నంబరు 1లో 240 అంకణాల స్థలం ఉంది. 2022లో ఆ స్థలం సబ్‌డివిజన్‌ చేసినట్లు చెప్పి వైకాపా నేత కంచి రాము ఆక్రమించారంటూ సునీత దంపతులు తిరుపతి జేసీ కోర్టును ఆశ్రయించారు. పలు వాయిదాల అనంతరం కోర్టు ఆ స్థలం యజమాని సునీతే అని తేల్చింది. అయినా కబ్జా ఆగలేదని ఆమె చెప్పారు. ‘కంచి రాము న్యాయస్థానంలో తప్పుడు పత్రాలు సమర్పించి నా స్థలంలో తిరిగి నిర్మాణాలు ప్రారంభించారు. విషయం తెలుసుకుని తిరిగి ఆస్ట్రేలియా నుంచి వచ్చా. ఎన్నాళ్లు ఈ అరాచకాలు? కబ్జాలకు హద్దు లేదా? ఎమ్మెల్యే మద్దతు ఉండటంతో అధికారులు నోరెత్తడం లేదు. ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డి సహకారంతో రాము ఇదే తరహాలో మరో స్థలాన్ని ఆక్రమించుకుని నగరపాలిక నుంచి రూ.16 కోట్ల టీడీఆర్‌ బాండ్లు తీసుకున్నారు. నేను తిరుపతిలోనే పుట్టి పెరిగాను. ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన కుమారుడు చేస్తున్న ఇలాంటి అరాచకాలు గతంలో ఎన్నడూ చూడలేదు’ అని సునీత ఆ వీడియోలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని