సెకి విద్యుత్‌ పిటిషన్‌పై అభ్యంతరాలు: ఏపీఈఆర్‌సీ

భారత సౌర విద్యుత్‌ సంస్థ (సెకి) నుంచి తీసుకునే ఏడు వేల మెగావాట్ల విద్యుత్‌ విక్రయ ఒప్పందంపై సంతకాలు చేయడానికి అనుమతించాలని కోరుతూ డిస్కంలు దాఖలు చేసిన పిటిషన్‌పై కొన్ని అభ్యంతరాలున్నాయని, అందుకే విచారణ వాయిదా వేశామని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 24 Feb 2024 05:37 IST

అందుకే విచారణ వాయిదా వేశాం

ఈనాడు, అమరావతి: భారత సౌర విద్యుత్‌ సంస్థ (సెకి) నుంచి తీసుకునే ఏడు వేల మెగావాట్ల విద్యుత్‌ విక్రయ ఒప్పందంపై సంతకాలు చేయడానికి అనుమతించాలని కోరుతూ డిస్కంలు దాఖలు చేసిన పిటిషన్‌పై కొన్ని అభ్యంతరాలున్నాయని, అందుకే విచారణ వాయిదా వేశామని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘సెకి ఒప్పందంపై చట్ట ప్రకారం బహిరంగ విచారణ జరపాల్సిన అవసరం లేదు. 2021లో సెకితో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందు డిస్కంలు మండలి అనుమతి కోరాయి. 2024-29 మధ్య అయిదేళ్ల విద్యుత్‌ డిమాండ్‌ అంచనాలు, వనరుల ప్రణాళిక పరిశీలన తర్వాత ఏడు వేల మెగావాట్లు  తీసుకోవడానికి మాత్రమే 2021 నవంబరు 11న షరతులతో కూడిన అనుమతి ఇచ్చాం. విద్యుత్‌ చట్టం ప్రకారం డిస్కంలు దాఖలు చేసిన విద్యుత్‌ టారిఫ్‌, ట్రూఅప్‌ ప్రతిపాదనలపై మాత్రమే బహిరంగ విచారణ నిర్వహిస్తాం. వాటి వివరాలనే మండలి వెబ్‌సైట్‌లో ఉంచుతాం. మండలికి వచ్చిన అన్ని పిటిషన్లనూ వెబ్‌సైట్‌లో ఉంచాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని