తితిదే నిబంధనలు వైకాపా నేతలకు వర్తించవా?

తిరుమల కొండపైకి ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ను తితిదే నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే. వైకాపా నాయకులు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు.

Published : 25 Feb 2024 05:32 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల కొండపైకి ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ను తితిదే నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే. వైకాపా నాయకులు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. శనివారం తిరుమలకు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ తీసుకొచ్చారు. ఈ సీసాలపై ‘సిద్ధం’ స్టిక్కర్లు ఉన్నాయి. వాటిపై ‘జి.శివారెడ్డి, మైదుకూరు నియోజకవర్గం’ అని వైకాపా నాయకులు, సీఎం జగన్‌ చిత్రాలు ముద్రించారు.

శ్రీవారి ఆలయం సమీపంలో నిలిపిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయశాఖ ప్రధాన సలహాదారు వాహనంలో ఈ సీసాలు కనిపించాయి. సాధారణంగా అలిపిరి తనిఖీ కేంద్రంలో వీటిని గుర్తించి తొలగించాలి. తనిఖీల నుంచి వీఐపీలకు మినహాయింపు ఉండటంతో.. దాన్ని అలుసుగా తీసుకొని వైకాపా నాయకులు ప్రచారం కోసం నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని