ప్రధాని విశాఖ పర్యటన రద్దు!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయినట్లు సమాచారం. హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) నవీకరణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మార్చి 1న ప్రధాని విశాఖ రావాల్సి ఉంది.

Published : 25 Feb 2024 05:38 IST

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయినట్లు సమాచారం. హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) నవీకరణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మార్చి 1న ప్రధాని విశాఖ రావాల్సి ఉంది. ఏయూ మైదానంలో బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. తాజాగా ప్రధాని పర్యటన రద్దయిందన్న సమాచారంతో ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే పర్యటన రద్దుపై అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని