రమణదీక్షితులపై తిరుమలలో కేసు

తితిదే అధికారులు, ఆలయంపై శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణదీక్షితులు వ్యాఖ్యలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న వీడియోపై తితిదే స్పందించింది.

Updated : 25 Feb 2024 06:33 IST

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే అధికారులు, ఆలయంపై శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణదీక్షితులు వ్యాఖ్యలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న వీడియోపై తితిదే స్పందించింది. తితిదే ప్రతిష్ఠను దిగజార్చేలా రమణదీక్షితులు వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని దేవస్థానం సైబర్‌ సెక్యూరిటీ, సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌ జీఎం ఎల్‌.మురళి సందీప్‌ తిరుమల వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.

ఆ గొంతు నాది కాదు: రమణదీక్షితులు

శ్రీవారిని శనివారం రమణదీక్షితులు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులు.. ఆలయంలో కైంకర్యాలు ఏవిధంగా జరుగుతున్నాయి.. పరిశీలించారా అని ఆయన్ను అడగ్గా.. గతంలో మాదిరే జరుగుతున్నాయన్నారు. మీపై పోలీసులు కేసు నమోదు చేశారన్న ప్రశ్నకు.. ఆ వీడియోలో ఉన్నది తన గొంతు కాదని, తనను ముద్దాయిలా చూస్తే తానేమీ చేయలేనని పేర్కొన్నారు.

చర్యలు తీసుకోండి: తిరుమల అహోబిల మఠం

తిరుమల అహోబిల మఠం ప్రతిష్ఠను కూడా దిగజార్చేలా రమణదీక్షితులు అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై ప్రభుత్వం, తితిదే చర్యలు తీసుకోవాలని మఠం అధికారి పద్మనాభచారియర్‌ శనివారం తితిదేకి లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని