Chicken: కొండెక్కిన కోడి.. కిలో చికెన్‌ రూ.300

కోడి కొండెక్కి కూర్చుంది. రాష్ట్రంలో కొన్నిచోట్ల కిలో చికెన్‌ ధర రూ.300 పలుకుతోంది. కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణం.

Updated : 28 Feb 2024 07:10 IST

ఈనాడు, అమరావతి: కోడి కొండెక్కి కూర్చుంది. రాష్ట్రంలో కొన్నిచోట్ల కిలో చికెన్‌ ధర రూ.300 పలుకుతోంది. కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణం. మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. గుడ్డు ధర కూడా ఒక్కోటి రూ.5 పైనే పలుకుతోంది. కార్తీక మాసం సమయంలో కోడి మాంసం ధరలు భారీగా పడిపోయాయి. అప్పుడు కిలో రూ.130 నుంచి రూ.140 చొప్పునే అమ్మాల్సి వచ్చింది. దీంతో అధికశాతం కోళ్ల ఫారాల యజమానులకు అప్పట్లో నష్టాలే మిగిలాయి. ఈ భయంతో కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. తల్లికోళ్లను కూడా గిట్టుబాటు కాక అమ్మేశారు. ఫలితంగా ఉత్పత్తి తగ్గి, కోళ్లకు కొరత ఏర్పడడంతో ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని