Prakasam: తన పేరు లేదని శిలాఫలకాలు ధ్వంసం చేసిన వైకాపా సర్పంచి

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో అభివృద్ధి పనులకు ఉద్దేశించిన శిలాఫలకాలను వైకాపా సర్పంచి ధ్వంసం చేశారు.

Updated : 28 Feb 2024 08:25 IST

పెద్దారవీడు, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో అభివృద్ధి పనులకు ఉద్దేశించిన శిలాఫలకాలను వైకాపా సర్పంచి ధ్వంసం చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయింది. మండలంలోని రేగునుమానుపల్లి, చట్లమిట్ల గ్రామాల సచివాలయం, ఆర్బీకేలు రేగునుమానుపల్లిలో నిర్మించారు. అక్కడే ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై రేగునుమానుపల్లి సర్పంచి పాలగిరి వెంకట రామాంజనేయరెడ్డి పేరును మాత్రం చేర్చలేదు.

వైకాపాకు చెందిన ఓ వర్గం నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు కావాలనే తన పేరును రాయలేదని రామాంజనేయరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు, అధికారుల పేర్లు రాసి.. సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్న తన పేరును విస్మరించారని మంగళవారం సుత్తెతో ఆ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. తనను గౌరవించకపోవడంతో బాధించి ఇలా చేశానని ఆయన చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని