సీఎం వస్తారట.. పామర్రు పారాహుషార్‌!

ముఖ్యమంత్రి జగన్‌ మార్చి 1న పామర్రుకు వచ్చి ‘విద్యా దీవెన’ నాల్గో విడత ప్రారంభించనున్నారు. ఇంకేం.. అధికారులు పామర్రును మసిపూసి మారేడుకాయలా చేస్తున్నారు.

Published : 28 Feb 2024 03:52 IST

ముఖ్యమంత్రి జగన్‌ మార్చి 1న పామర్రుకు వచ్చి ‘విద్యా దీవెన’ నాల్గో విడత ప్రారంభించనున్నారు. ఇంకేం.. అధికారులు పామర్రును మసిపూసి మారేడుకాయలా చేస్తున్నారు. సార్‌ కంటికి రోడ్ల పక్కనున్న మురుగు కనిపించకూడదని దారులకు రెండు వైపులా పరదాలు కడుతున్నారు. ఇక చెట్ల కొమ్మల నరికివేతలంటారా... అధికారులు ఆ పనీ చేస్తున్నారు. సీఎం వెళ్లనున్న మార్గంలో చెట్లకు కొమ్మలు లేకుండా చేస్తున్నారు.

హెలిప్యాడ్‌, సభావేదిక వద్దనున్న పెద్ద చెట్ల కొమ్మలనూ కొట్టేస్తున్నారు. రోడ్డుకు రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. సభ ఒకటో తేదీన ఉంటే.. ఏర్పాట్ల హడావుడితో ఇప్పటికే రెండు రోజులుగా దుకాణాలు బంద్‌ చేసుకోవాల్సి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక రేపు, ఎల్లుండి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.      

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని