శ్రీరామానుజర్‌ సేవలో నారా లోకేశ్‌

తమిళనాడులోని శ్రీరామానుజర్‌ ఆలయాన్ని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మంగళవారం దర్శించుకున్నారు.

Published : 28 Feb 2024 03:58 IST

చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడులోని శ్రీరామానుజర్‌ ఆలయాన్ని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మంగళవారం దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి చెన్నై విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీపెరుంబుదూర్‌లోని శ్రీరామానుజర్‌ ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ ఏనుగు ఆశీస్సుల తర్వాత స్వామివారు, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో స్వామి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. దర్శనం తర్వాత చెన్నై విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని