ఈడబ్ల్యూఎస్‌ కోటా భర్తీకి అనుమతించేలా ఆదేశించండి

బీఈడీ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) కోటా కింద 10 శాతం సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.

Published : 28 Feb 2024 04:10 IST

హైకోర్టులో బీఈడీ కళాశాలల యాజమాన్యాలు వ్యాజ్యం

ఈనాడు, అమరావతి: బీఈడీ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) కోటా కింద 10 శాతం సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వం, ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి ప్రాంతీయ డైరెక్టర్‌ను ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. బీఈడీ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం సీట్లను భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాలుచేస్తూ వినుకొండకు చెందిన శ్రీవివేకానంద కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, మరో మూడు కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. సీట్ల భర్తీకి అనుమతించేలా ఆదేశించాలని కోరాయి. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వకపోవడం విద్యార్థుల ప్రాథమిక హక్కులను హరించడమేనన్నారు. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తయిందని, రెండో దశలోనూ సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని