నేడు రుషికొండ రిసార్ట్‌ ప్రారంభం

విశాఖలో రుషికొండ రిసార్ట్‌ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రభుత్వం రహస్యంగా చేపడుతోంది. రూ.450 కోట్ల ప్రజాధనంతో నిర్మించినా... అతి కొద్దిమందికే ఆహ్వానాలు పంపినట్లు తెలిసింది.

Published : 29 Feb 2024 03:24 IST

మంత్రి రోజా చేతుల మీదుగా లక్ష్మీపూజ!
అతి కొద్దిమందికే ఆహ్వానాలు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో రుషికొండ రిసార్ట్‌ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రభుత్వం రహస్యంగా చేపడుతోంది. రూ.450 కోట్ల ప్రజాధనంతో నిర్మించినా... అతి కొద్దిమందికే ఆహ్వానాలు పంపినట్లు తెలిసింది. సీఎం జగన్‌, మంత్రి రోజా చిత్రాలతో కూడిన ఆహ్వానపత్రికలను ఇందుకు సిద్ధం చేశారు. రుషికొండ పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రారంభం పేరుతో వాటిని అందజేశారు. అధికార పార్టీ నేతలు, పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వరప్రసాద్‌ రెడ్డి, ఇతర పాలకమండలి సభ్యులు, ఆయా శాఖల ఉన్నతాధికారులకే వాటిని పంపించినట్లు తెలిసింది. పర్యాటకశాఖ మంత్రి రోజా చేతుల మీదుగా గురువారం ఉదయం 10.30 గంటలకు లక్ష్మీపూజతో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం రాత్రే నగరానికి చేరుకున్నారు. ఏపీటీడీసీ ఎండీ కన్నబాబు కూడా నగరానికి చేరుకున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, ఇతర నేతలు హాజరుకానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని