తప్పుడు కథనాలతో మోసం చేయలేరు

జామకాయను నిమ్మకాయ.. నిమ్మకాయను జామకాయ చేసినట్లు బుధవారం సాక్షి దినపత్రికలో ‘పట్టు రైతులకు అండగా ప్రభుత్వం’ శీర్షికన ప్రచురితమైన కథనం ఉందని పట్టు రైతులు ఖండించారు.

Published : 29 Feb 2024 03:25 IST

‘సాక్షి’పై భగ్గుమన్న పట్టు రైతులు

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: జామకాయను నిమ్మకాయ.. నిమ్మకాయను జామకాయ చేసినట్లు బుధవారం సాక్షి దినపత్రికలో ‘పట్టు రైతులకు అండగా ప్రభుత్వం’ శీర్షికన ప్రచురితమైన కథనం ఉందని పట్టు రైతులు ఖండించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌ వద్ద వారు సమావేశమై.. పట్టు రైతుల పాలిట జగన్‌ ప్రభుత్వం అండగా కాదు, మొండిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నాలుగేళ్లుగా బైవోల్టిన్‌ రైతులకు రూ.57 కోట్ల ప్రోత్సాహక మొత్తం చెల్లించాలని ప్రతి నెలా రెండు దఫాలు అమరావతికి వెళ్లి మంత్రిని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి విన్నవించాం. రైతులకు ప్రభుత్వం రూ.100 కోట్లు చెల్లిస్తోందని, ఈ చిన్నమొత్తం ఎంతమాత్రం అంటూ వారు మసిపూస్తూ వచ్చారు. తెదేపా పాలనలో అందించే అన్ని రాయితీలు రద్దుచేసి, ఇప్పటివరకు ప్రోత్సాహక మొత్తం అందించకుండా నిర్లక్ష్యం చేశారు. పట్టుసాగు వ్యయం పెరిగి ప్రస్తుతం ఉన్న ధరలు గిట్టుబాటు కాక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రోత్సాహక మొత్తం రెట్టింపు చేస్తామన్న ముఖ్యమంత్రి.. కనీసం పట్టు రైతులు కలిసి సమస్య వివరిస్తామన్నా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. సాక్షిపత్రికలో అసత్యాలు ప్రచురించి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైకాపా అనుకోవడం భ్రమ’’ అని పట్టు రైతులు అన్నారు. ఇప్పటికైనా పట్టు రైతులు, పట్టు రీలర్లకు బకాయి ఉన్న ప్రోత్సాహక మొత్తాన్ని ముఖ్యమంత్రి వెంటనే విడుదల చేయాలని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని