‘ఎన్నికలప్పుడు మా గ్రామాలకు ఎలా వస్తారో చూస్తాం’

‘భూ సమస్యలు పరిష్కరించాలని, సాగుభూమి పట్టాలివ్వాలంటూ వినతి ఇచ్చేందుకు వచ్చిన మమ్మల్ని విస్మరించారు.

Updated : 29 Feb 2024 09:25 IST

ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర తీరుపై గిరిజనుల ఆగ్రహం
వినతిపత్రం తీసుకోకుండా వెళ్లిపోవడంపై అభ్యంతరం

గజపతినగరం(మెంటాడ), న్యూస్‌టుడే: ‘భూ సమస్యలు పరిష్కరించాలని, సాగుభూమి పట్టాలివ్వాలంటూ వినతి ఇచ్చేందుకు వచ్చిన మమ్మల్ని విస్మరించారు. ఎన్నికల సమయంలో మా గ్రామాలకు ఎలా వస్తారో చూస్తాం’ అంటూ విజయనగరం జిల్లా మెంటాడ మండలానికి చెందిన పలువురు గిరిజనులు ఉప ముఖ్యమంత్రి రాజన్నదొరపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెంటాడ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వాలంటీర్లకు వందనం, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాజన్నదొర వస్తారని తెలుసుకున్న ఆండ్ర, కె.లింగాలవలస తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు అక్కడికి చేరుకున్నారు. రెండు గంటల నిరీక్షణ తరువాత అక్కడికి వచ్చిన రాజన్నదొరకు.. సాగుభూమికి పట్టాలు ఇవ్వాలని కోరుతూ వినతి ఇచ్చినా తీసుకోకుండా వెళ్లిపోయారు. దీంతో సీపీఎం నాయకుడు రాకోటి రాములు, గిరిజన సంఘ నేత తామరాపల్లి సోములుల ఆధ్వర్యంలో వారంతా రాజన్నదొర తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధికి ప్రజల సమస్యలను వినాల్సిన బాధ్యత ఉన్నా, విస్మరించడం సరికాదని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు