వైకాపా ఫ్లెక్సీకి పోలీసు రక్షణ!

ప్రతిపక్ష నేతల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని పోలీసులు.. అధికార పార్టీ అయితే.. ఆ నాయకులకే కాదు వారి ఫ్లెక్సీలకూ భద్రత కల్పిస్తున్నారు.

Published : 29 Feb 2024 03:50 IST

ప్రతిపక్ష నేతల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని పోలీసులు.. అధికార పార్టీ అయితే.. ఆ నాయకులకే కాదు వారి ఫ్లెక్సీలకూ భద్రత కల్పిస్తున్నారు. గుంటూరు నగరంలో కొరిటిపాడు గుజ్జనగూళ్ల ప్రధాన రహదారిలో పది రోజుల కిందట వైకాపా, తెదేపా నాయకులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెదేపా ఫ్లెక్సీని మంగళవారం రాత్రి ఎవరో చించేశారు. ఇది తెలుసుకున్న వైకాపా నాయకులు తెల్లారేసరికి వారి ఫ్లెక్సీ వద్ద ఓ పోలీసును దించారు. చించేసిన తెదేపా ఫ్లెక్సీ సాక్షిగా వైకాపా ప్రచార కటౌట్‌ నీడలో ఓ పోలీసు రోజంతా విధులు నిర్వర్తించడం చూసి నగరవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఈనాడు, గుంటూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని