మా పాలనలో ఉద్యోగులు ఇబ్బందిపడిన మాట వాస్తవమే: ఎమ్మెల్యే బాలినేని

అయిదేళ్ల తమ పాలనలో రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందిపడిన మాట వాస్తవమేనని వైకాపా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.

Published : 29 Feb 2024 03:53 IST

ఒంగోలు, న్యూస్‌టుడే: అయిదేళ్ల తమ పాలనలో రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందిపడిన మాట వాస్తవమేనని వైకాపా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైకాపాకు రాజీనామా చేశాక ఆయనతో కలిసి బాలినేని ఒంగోలులో ఎన్జీవో భవన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ... ‘పీఆర్‌సీ విషయంలో సీఎం జగన్‌తో గతంలో చర్చించాను. ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారనీ చెప్పాను. తర్వాత నుంచి నేను ఎప్పుడు సీఎంను కలిసినా.. గట్టిగా మాట్లాడుతున్నానని ఇంటెలిజెన్స్‌ అధికారులతో జగన్‌ అనేవారు. నేను ప్రజల కోసమే పట్టుబడతానని చెప్పాను. ఎంపీ మాగుంటకు ఒంగోలు సీటు కోసం గట్టిగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయా’ అన్నారు. ఇప్పుడు మాగుంట వైకాపాకు రాజీనామా చేసిన నేపథ్యంలో నేనూ తెదేపాలోకి పోవాలా? అని వ్యాఖ్యానించారు. ఈసారి టికెట్‌ ఇవ్వకపోయినా బాధపడనని, తనకు ఇవే చివరి ఎన్నికలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని