విలేకర్లకు నూతన వస్త్రాల ఎర

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలోని వైకాపా నేతలు మీడియా ప్రతినిధుల్ని మచ్చిక చేసుకునేందుకు బహుమతులు పంపిణీ చేశారు.

Published : 29 Feb 2024 05:15 IST

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలోని వైకాపా నేతలు మీడియా ప్రతినిధుల్ని మచ్చిక చేసుకునేందుకు బహుమతులు పంపిణీ చేశారు. బుధవారం సాయంత్రం హనుమాన్‌ జంక్షన్‌లోని వైకాపా కార్యాలయంలో బాహాటంగానే ఈ కార్యక్రమం చేపట్టారు. ఇటీవలే అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిసింది. వైకాపా మండల బాధ్యులు నక్కా గాంధీ, ఎ.శేషగిరిరావు, ఎంపీపీ నగేష్‌, జడ్పీటీసీ సభ్యురాలు గంగాభవానీ, సర్పంచి కమలాబాయి, సహకార సంఘం ఛైర్మన్‌ దయాల విజయనాయుడులు స్వయంగా కానుకలు అందజేశారు.

న్యూస్‌టుడే, హనుమాన్‌జంక్షన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు