KA Paul: ‘స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమంటే నెల రోజుల్లో రూ.8వేల కోట్లు జమ చేస్తా’

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే.. బిలియనీర్లయిన తన విదేశీ మిత్రుల సాయంతోపాటు తన సొమ్ము కూడా కలిపి మొత్తం రూ.8 వేల కోట్లను మొదటి విడతలో నెల రోజుల్లోనే జమ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ హైకోర్టుకు విన్నవించారు.

Updated : 29 Feb 2024 08:08 IST

హైకోర్టుకు విన్నవించిన కేఏ పాల్‌

ఈనాడు, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే.. బిలియనీర్లయిన తన విదేశీ మిత్రుల సాయంతోపాటు తన సొమ్ము కూడా కలిపి మొత్తం రూ.8 వేల కోట్లను మొదటి విడతలో నెల రోజుల్లోనే జమ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ హైకోర్టుకు విన్నవించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన వేసిన పిల్‌పై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్‌, జస్టిస్‌ ఎన్‌.విజయ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పాల్‌ బుధవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్లాంట్‌కు చెందిన వేల ఎకరాలు ఇప్పటికే విక్రయించారన్నారు. కేవలం 16 వేల ఎకరాలు మాత్రమే మిగిలి ఉందన్నారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా అడ్డుకోవాలని, భూముల విక్రయ ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై గతంలో దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాలు, ఓ వ్యాజ్యాన్ని ప్రస్తుత పిల్‌తో జత చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను మార్చి రెండో వారానికి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని