విచ్చలవిడి తవ్వకాలతో పొట్ట కొట్టొద్దు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం ధవళేశ్వరం పరిధిలో ఉన్న ఇసుక ర్యాంపుల్లో రేయింబవళ్లు జరుగుతున్న అక్రమ డ్రెడ్జింగ్‌ పనులు నిలిపివేయాలని కోరుతూ బోట్స్‌మెన్‌ సొసైటీ కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు.

Published : 29 Feb 2024 05:14 IST

కార్మికుల ఆందోళన

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం ధవళేశ్వరం పరిధిలో ఉన్న ఇసుక ర్యాంపుల్లో రేయింబవళ్లు జరుగుతున్న అక్రమ డ్రెడ్జింగ్‌ పనులు నిలిపివేయాలని కోరుతూ బోట్స్‌మెన్‌ సొసైటీ కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు. డ్రెడ్జింగ్‌ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపి తరలిస్తుండటంతో మూడు వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాటన్‌ బ్యారేజీ నుంచి మూడు కిలోమీటర్ల లోపు ఇసుక తవ్వకాలు జరపకూడదని నిబంధనలు ఉన్నట్లు గుర్తు చేశారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు వెంకటరావు, శ్రీను, సునీల్‌, అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని