Vijayawada: మద్య నిషేధం ఏది జగన్‌? బార్‌ వద్ద మహిళల నిరసన

దశలవారీగా మద్య నిషేధం చేస్తామన్న సీఎం జగన్‌.. ఇప్పుడు మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని మహిళలు మండిపడ్డారు.

Updated : 01 Mar 2024 07:08 IST

భవానీపురం, న్యూస్‌టుడే : దశలవారీగా మద్య నిషేధం చేస్తామన్న సీఎం జగన్‌.. ఇప్పుడు మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని మహిళలు మండిపడ్డారు. ఇప్పటికైనా మద్య నిషేధం చేయాలంటూ విజయవాడ సమీపంలో ఆందోళన చేశారు. గురువారం ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జక్కంపూడి కాలనీలోని బార్‌ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేశారు. ఈ క్రమంలో బార్‌ నిర్వాహకులు వాగ్వాదానికి దిగి, అక్కడి నుంచి వెళ్లిపోవాలని మహిళలను హెచ్చరించారు. ఈ సందర్భంగా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవానీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మద్యంపై ఏడాదికి రూ.16 వేల కోట్ల ఆదాయం వస్తే.. జగన్‌ అధికారం చేపట్టాక అది రూ.36 వేల కోట్లకు చేరిందన్నారు. బెల్టుషాపులు 70వేలకు పైగా ఉన్నాయని, కల్తీ మద్యం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం నిషేధం చేస్తామని అన్ని పార్టీలూ తమ మ్యానిఫెస్టోల్లో ప్రకటించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, నాయకులు ఓసు భారతి, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు