ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ అన్నారు.

Published : 01 Mar 2024 04:36 IST

పుణ్యక్షేత్రాల పర్యటనకు బస్సులను ప్రారంభించిన మంత్రి సత్యనారాయణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ అన్నారు. గురువారం విజయవాడలోని ఏపీ టూరిజం కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ, పర్యాటక శాఖ, సహ బ్రాండింగ్‌ సంస్థ ద్వారా నిర్వహించనున్న పర్యాటక, ఆధ్యాత్మిక యాత్రల  బస్సులను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ‘ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ.. యాత్రికులకు ప్యాకేజీ టూర్లు, హోటళ్లు వంటి వసతి, భోజన సౌకర్యాలను అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులకు, పర్యాటకులకు ఇది మంచి అవకాశం. వైకాపా పాలనలో రాష్ట్రంలో అనేక దేవాలయాలను అభివృద్ధి చేశాం. భక్తులకు దర్శనం, విశేష పూజల టికెట్లు, అభిషేకాలు, వ్రతాలకు సంబంధించిన అన్ని టికెట్లను దేవాదాయశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాం. బయట వేల రూపాయలు ఖర్చు చేసే భక్తులకు ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టే ఈ పుణ్యక్షేత్రాల యాత్ర మంచి అవకాశం’ అని మంత్రి సత్యనారాయణ అన్నారు. భక్తులు, పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని