వైకాపా నాయకులు ఆక్రమించుకున్న స్వర్ణనాగయ్య భూమిని వెనక్కి ఇవ్వాలి

వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, మొదటి దళిత శాసనసభ్యుడు స్వర్ణనాగయ్యకు అప్పటి ప్రభుత్వం కేటాయించిన భూమిని వైకాపా నాయకులు ఆక్రమించుకున్నారని ప్రజాసంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్‌ ఆంజినేయులు ఆరోపించారు.

Published : 01 Mar 2024 04:44 IST

ప్రజాసంఘాల ఐక్యవేదిక

కడప, చిన్నచౌకు, జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, మొదటి దళిత శాసనసభ్యుడు స్వర్ణనాగయ్యకు అప్పటి ప్రభుత్వం కేటాయించిన భూమిని వైకాపా నాయకులు ఆక్రమించుకున్నారని ప్రజాసంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్‌ ఆంజినేయులు ఆరోపించారు. అక్రమార్కులపై రాజద్రోహం కేసు నమోదు చేయకపోతే నిరాహార దీక్షలకైనా వెనకాడబోమని హెచ్చరించారు. భూ ఆక్రమణను నిరసిస్తూ గురువారం కడప బాలజీనగర్‌లోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఎదుట, కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆంజినేయులు మాట్లాడుతూ.. అప్పటి ప్రభుత్వం స్వర్ణనాగయ్యకు కడప నగర శివారులోని గూడూరు వద్ద అయిదెకరాల స్థలం కేటాయించిందని, ఈ స్థలాన్ని వైకాపా నాయకులు ఆక్రమించుకున్నారన్నారు. స్థలాన్ని వెనక్కి ఇవ్వకపోతే ఉద్యమాలు చేస్తామని, నిరాహార దీక్షలకైనా వెనకాడబోమన్నారు. ఆందోళనలో స్వర్ణనాగయ్య మనవరాలు సుందరమ్మ, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు అవ్వారు మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు