చేయూతలో వాలంటీర్ల చేతివాటం

‘చేయూత’ పథకం లబ్ధిదారులు 70 మంది నుంచి వార్డు వాలంటీర్లు ముడుపులు వసూలు చేశారని గుంటూరు జిల్లా తెనాలి 33వ వార్డు వైకాపా కౌన్సిలర్‌ మొగల్‌ రహమత్‌ బేగ్‌ ఆరోపించారు.

Updated : 01 Mar 2024 07:34 IST

రూ.వెయ్యి చొప్పున వసూలు చేశారంటూ వైకాపా కౌన్సిలర్‌ వీడియో ప్రదర్శన

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: ‘చేయూత’ పథకం లబ్ధిదారులు 70 మంది నుంచి వార్డు వాలంటీర్లు ముడుపులు వసూలు చేశారని గుంటూరు జిల్లా తెనాలి 33వ వార్డు వైకాపా కౌన్సిలర్‌ మొగల్‌ రహమత్‌ బేగ్‌ ఆరోపించారు. గురువారం జరిగిన కౌన్సిల్‌ సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్కో లబ్ధిదారు నుంచి వాలంటీర్లు రూ.వెయ్యి చొప్పున వసూలు చేశారంటూ, సంబంధిత వీడియోను ప్రదర్శించారు. ఈ విషయాన్ని మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అధికార పార్టీ సభ్యుడే ఆరోపణ చేయడం కౌన్సిల్‌లో చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని