కుట్రతో కూల్చి.. పాతవంటూ ప్రచారం!

విశాఖలోని ‘రుషికొండ’పై చేసిన విధ్వంసానికి వైకాపా పాలకులు ఇప్పుడు కొత్త సాకులు చెబుతున్నారు.

Updated : 01 Mar 2024 07:49 IST

‘రుషికొండ’పై రాజసౌధం నిర్మాణానికి సాకులెన్నో!

విశాఖలోని ‘రుషికొండ’పై చేసిన విధ్వంసానికి వైకాపా పాలకులు ఇప్పుడు కొత్త సాకులు చెబుతున్నారు. అక్కడ గతంలో ఉన్న పర్యాటకశాఖ భవనాలు శిథిలమైపోవడం వల్లే కూల్చేశామని నమ్మబలుకుతున్నారు. గురువారం కొండపై సీఎం కోసమని నిర్మించిన సౌధం, ఇతర భారీ భవనాలను మంత్రులు, అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ.. గతంలో అక్కడున్న భవనాలు పాతవి కావడం వల్లే కూల్చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. దీంతో ఆ భవనాల విషయం మరోసారి చర్చనీయాంశమైంది. నిత్య నూతనంగా వెలిగిపోయిన నిర్మాణాలను కావాలనే నేలమట్టం చేసి ఇప్పుడు కొత్త కథ అల్లుతున్నారని పలువురు విమర్శించారు. పర్యావరణవేత్తలు ఎంత వద్దన్నా.. సీఎం కోసం కొత్త నిర్మాణాలు చేపట్టాలనే వాటిని కొట్టేశారని దుయ్యబడుతున్నారు. కూల్చివేసే నాటికి కొండపై ఉన్న భవనాలు ఎంత పటిష్ఠంగా ఉన్నాయో ఈ చిత్రాలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

ఈనాడు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని