Amaravati: రాజధాని పేదల విద్య, వైద్యం ఇప్పుడు గుర్తొచ్చాయా?

ఎన్నికల వేళ రాజధాని పేదలపై జగన్‌ ప్రభుత్వానికి ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చేస్తోంది.

Updated : 02 Mar 2024 08:07 IST

ఎన్నికల వేళ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: ఎన్నికల వేళ రాజధాని పేదలపై జగన్‌ ప్రభుత్వానికి ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చేస్తోంది. అమరావతిని సర్వనాశనం చేసేందుకు అయిదేళ్లుగా కంకణం కట్టుకుని, అక్కడి ప్రజలపై ఎక్కడలేని దాష్టీకాలు చేసిన జగన్‌ ప్రభుత్వం.. ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి రాజధాని గ్రామాల పేదల్ని మంచి చేసుకునేందుకు అనేక గిమ్మిక్కులు ప్రదర్శిస్తోంది. రాజధానిలోని భూమిలేని పేదలకు ప్రతి నెలా ఇచ్చే పింఛను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం.. ఆ నిధులు విడుదల చేస్తూ శుక్రవారం జీవో ఇచ్చింది. పేదలకు పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతి కల్పించేందుకు రూ.21.98 కోట్లు విడుదల చేస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని