ఆదివారం బడి పెట్టుకోండి.. సోమవారం సెలవు ఇచ్చుకోండి

నంద్యాల జిల్లా బనగానపల్లెలో సోమవారం(ఈ నెల 4న) ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన సందర్భంగా.. జిల్లాలోని విద్యాసంస్థలకు చెందిన బస్సులను అధికారులకు అప్పగించాలని డీఈవో సుధాకర్‌రెడ్డి ఆదేశాలిచ్చినట్లు తెలిసింది.

Published : 02 Mar 2024 04:47 IST

నంద్యాల విద్య, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా బనగానపల్లెలో సోమవారం(ఈ నెల 4న) ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన సందర్భంగా.. జిల్లాలోని విద్యాసంస్థలకు చెందిన బస్సులను అధికారులకు అప్పగించాలని డీఈవో సుధాకర్‌రెడ్డి ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. సీఎం సభకు ప్రజలను తరలించడానికి వీలుగా ఈ నెల 3న సాయంత్రం 5 గంటల్లోగా బస్సులు అప్పగించాలన్నారు. అవసరమైతే ఆదివారం తరగతులు నిర్వహించుకోవచ్చని.. సోమవారం సెలవు ప్రకటించాలని ఆయా యాజమాన్యాలకు సూచించినట్లు తెలిసింది. పరీక్షల సమయంలో ఇలా పాఠశాలల బస్సులు తరలిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని