వివేకా హత్యలో సునీత కుటుంబం పాత్రపై అనుమానాలున్నాయి

‘వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మాట్లాడిన మాటలన్నీ చంద్రబాబు పలికించిన చిలుక పలుకులే.. దిల్లీలో ఆమె ప్రెస్‌మీట్‌ రాజకీయ కుట్రలో భాగమే’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు.

Updated : 02 Mar 2024 06:14 IST

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఈనాడు, అమరావతి: ‘వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మాట్లాడిన మాటలన్నీ చంద్రబాబు పలికించిన చిలుక పలుకులే.. దిల్లీలో ఆమె ప్రెస్‌మీట్‌ రాజకీయ కుట్రలో భాగమే’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వివేకా హత్యలో సునీత కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందేమోనన్న అనుమానాలున్నాయి. సీబీఐకి వచ్చిన కొన్ని వాంగ్మూలాలను లోతుగా చూస్తే అది కనిపిస్తోంది. వాటిమీద కూడా విచారణ జరగాలి కదా..? వాటిని తప్పించుకోడానికి దొంగే.. దొంగ దొంగ అన్నట్లు మాట్లాడుతున్నారేమో! తన తండ్రిని కిరాతకంగా చంపినవాడు సునీతకు మంచోడెలా అయ్యాడు? ఒక హంతకుడిని అప్రూవర్‌గా చేసుకుని, ఆ వ్యక్తిని అక్కున చేర్చుకుని సోదరుడిలా చూస్తున్న వీళ్లను ఏమనాలి? వివేకా హత్య కేసు వారం లోపు తేలేదే అయితే..ఆయన హత్య జరిగాక రెండున్నర నెలలపాటు చంద్రబాబు ప్రభుత్వమే ఉంది..అప్పుడే ఆయన ఆ కేసును ఎందుకు తేల్చలేదు? తప్పుడు ఆరోపణలు చేసి, ముఖ్యమంత్రి జగన్‌ను విచారించాలనడం విచిత్రంగా ఉంది’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని