108 వాహనం ఆలస్యం.. వృద్ధుడి మృతి

సకాలంలో వైద్యం అందేలా ఆసుపత్రికి చేర్చాల్సిన 108 అంబులెన్స్‌ గంట ఆలస్యంగా రావడంతో ఓ వృద్ధుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Published : 02 Mar 2024 04:11 IST

మడకశిర, న్యూస్‌టుడే: సకాలంలో వైద్యం అందేలా ఆసుపత్రికి చేర్చాల్సిన 108 అంబులెన్స్‌ గంట ఆలస్యంగా రావడంతో ఓ వృద్ధుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం జమ్మానుపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసింహప్ప(65)కు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండడంతో ఉదయం 6 గంటలకు 108కు ఫోన్‌ చేయగా, మొదట కాల్‌ కన్నడలో మాట్లాడారు. వెంటనే మరో ఫోన్‌తో కాల్‌ చేయగా.. మడకశిర అంబులెన్స్‌ అందుబాటులో లేదు, మరో దానికి కనెక్ట్‌ చేసి చెబుతామని కాల్‌ సెంటర్‌ వారు చెప్పారు. అప్పటికే కడుపునొప్పి తీవ్రతతో పెద్దగా అరుస్తున్న నరసింహప్పను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 7.36 నిమిషాలకు అంబులెన్స్‌ వైద్య సిబ్బంది వచ్చి సీపీఆర్‌ చేశారు. అయితే అప్పటికే ప్రాణం పోయింది. మడకశిర నుంచి జమ్మానుపల్లికి 12 కిలోమీటర్ల దూరం. ఇక్కడికి 108 అంబులెన్స్‌ చేరుకోవడానికి సాధారణంగా 20 నుంచి 30 నిమిషాలు చాలు. గంట ఆలస్యంగా 108 వాహనం వచ్చిందని, సకాలంలో ప్రథమ చికిత్స అందించి ఉంటే ప్రాణాలు నిలిచేవంటూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని