ఎండలోనే విద్యార్థులకు ‘పరీక్ష’

అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలోని కేంద్రంలో శుక్రవారం ఇంటర్‌ మొదటి ఏడాది విద్యార్థులు ఎండలో కూర్చుని పరీక్ష రాశారు.

Published : 02 Mar 2024 04:12 IST

ఉరవకొండ, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలోని కేంద్రంలో శుక్రవారం ఇంటర్‌ మొదటి ఏడాది విద్యార్థులు ఎండలో కూర్చుని పరీక్ష రాశారు. ఉరవకొండలోని రెండు ప్రభుత్వ, ఒక ప్రైవేటు జూనియర్‌ కళాశాలతో పాటు విడపనకల్లు, వజ్రకరూరు మండలాల ఇంటర్‌ విద్యార్థులకు ఇదే కేంద్రాన్ని కేటాయించారు. ఇక్కడ గదుల కొరత కారణంగా కళాశాల ప్రాంగణంలోని సభా వేదిక షెడ్డులోనూ కొంతమందికి పరీక్ష నిర్వహించారు. అందులో ఒక వైపు పూర్తిగా ఎండ పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని