శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.10 గంటలకు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో డి.పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు ప్రారంభ పూజలు నిర్వహించారు.

Published : 02 Mar 2024 04:15 IST

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.10 గంటలకు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో డి.పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు ప్రారంభ పూజలు నిర్వహించారు. శివసంకల్పం, గణపతి, చండీశ్వర తదితర పూజలు చేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున ఈవో ఎస్‌.వి.నాగేశ్వరరావు, ప్రధానార్చకులు గురుకుల్‌ శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ క్రతువులు జరిగాయి. రాత్రి 8 గంటలకు సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఈవో ధ్వజపటం ఆవిష్కరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను నిలిపివేశారు. భక్తులకు శ్రీస్వామి, అమ్మవార్ల అలంకార దర్శన భాగ్యం కల్పించారు. ఇరుముడి కలిగిన శివదీక్షా భక్తులకు విడతల వారీగా స్పర్శదర్శనం కల్పిస్తున్నారు.


‘అహోబిలం పార్వేటోత్సవం’ ఇక రాష్ట్ర పండగ

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే : అహోబిలం లక్ష్మీనృసింహస్వామి పార్వేటోత్సవాన్ని రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ శుక్రవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై అహోబిలం మఠం సమాచార అధికారి సేతురామన్‌ మాట్లాడుతూ.. పార్వేటోత్సవంపై మఠం, ఇన్‌టాచ్‌ సంస్థ సంయుక్తంగా రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. ఉత్సవ తీరు తెన్నులను పరిశీలించి, ప్రత్యేక ఉత్సవంగా పరిగణించిందన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని