నేడు పల్స్‌ పోలియో

నేషనల్‌ ఇమ్యునైజేషన్‌ డే’ను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అయిదేళ్లలోపు పిల్లలకు ఆదివారం పల్స్‌ పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Updated : 03 Mar 2024 07:01 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘నేషనల్‌ ఇమ్యునైజేషన్‌ డే’ను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అయిదేళ్లలోపు పిల్లలకు ఆదివారం పల్స్‌ పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఆదివారం బూత్‌డే కాగా.. 4, 5 తేదీల్లో గ్రామీణ ప్రాంతాల్ల్లో, 6న పట్టణ ప్రాంతాల్లో వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె.నివాస్‌ తెలిపారు. రాష్ట్రంలోని 53,35,519 మంది అయిదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి 37,465 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు ‘నిండు జీవితానికి రెండు చుక్కలు’ నినాదం ద్వారా సిబ్బంది.. పోలియో చుక్కల ప్రయోజనాన్ని పిల్లల తల్లిదండ్రులకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓలను కమిషనర్‌ జె.నివాస్‌ ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు