మంత్రి గారూ.. ఉద్యోగాలు లేవేం?

చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావడం లేదని, ఈ సమస్యను పరిష్కరించాలని ఓ వ్యక్తి మంత్రి బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు.

Published : 03 Mar 2024 04:17 IST

బొత్సను ప్రశ్నించిన స్థానికుడు

గజపతినగరం, న్యూస్‌టుడే: చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావడం లేదని, ఈ సమస్యను పరిష్కరించాలని ఓ వ్యక్తి మంత్రి బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగచోళ్లపెంటలో నిర్మించిన రైతుభరోసా, వెల్‌నెస్‌ కేంద్రాల భవనాలతో పాటు పట్రువాడ వద్ద వంతెనను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. దాదాపు ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలతో లబ్ధి చేకూరిందని తెలిపారు. ఇంకెవరికైనా సమస్యలు ఉంటే చెప్పాలని అడిగారు. ఇంతలోనే 45 ఏళ్ల వ్యక్తి లేచి.. యువతకు ఉద్యోగాలు రావడం లేదని చెప్పారు. అతనిపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి చివర్లో సమాధానం చెబుతానని దాటవేశారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యే అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ సురేష్‌బాబు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని