విశాఖ్‌ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)కు చెందిన విశాఖ్‌ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టును ప్రధాని నరేంద్రమోదీ శనివారం జాతికి అంకితం చేశారు.

Published : 03 Mar 2024 04:21 IST

విశాఖపట్నం (సింధియా), న్యూస్‌టుడే: విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)కు చెందిన విశాఖ్‌ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టును ప్రధాని నరేంద్రమోదీ శనివారం జాతికి అంకితం చేశారు. వర్చువల్‌ విధానంలో ఆయన దీనిని ప్రారంభించారు. ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌ వార్షిక ఇంధన ఉత్పత్తి సామర్థ్యం 8.3 మిలియన్‌ టన్నులు కాగా.. విస్తరణ నేపథ్యంలో 15 మిలియన్‌ టన్నులకు చేరింది. కార్యక్రమంలో సంస్థ ఈడీ రతన్‌రాజ్‌, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని