భూహక్కు చట్టం రద్దు చేసే వరకు పోరాడతాం

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూహక్కు చట్టాన్ని (ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు) రద్దు చేసే వరకు న్యాయవాదులు తమ ఆందోళనల్ని కొనసాగించనున్నారు.

Published : 03 Mar 2024 04:25 IST

గుంటూరు సదస్సులో బార్‌ అసోసియేషన్ల ప్రతినిధులు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూహక్కు చట్టాన్ని (ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు) రద్దు చేసే వరకు న్యాయవాదులు తమ ఆందోళనల్ని కొనసాగించనున్నారు. ఈ మేరకు శనివారం గుంటూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదుల సదస్సు’లో నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు నిరసనలు చేపట్టాలని తీర్మానించారు. సదస్సుకు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి బార్‌ అసోసియేషన్ల ప్రతినిధులు హాజరయ్యారు. న్యాయవాదుల ఉద్యమం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని.. ఓ గుంటూరు న్యాయవాది వేసిన రిట్‌ పిటిషన్‌ను ఉపసంహరింపజేయాలని కడప జిల్లా బార్‌ అసోసియేషన్‌ నాయకుడు పీఎస్‌ నాగసుబ్రహ్మణ్యం కోరారు. నూజివీడు బార్‌ అసోసియేషన్‌ నాయకుడు సత్యప్రకాష్‌ మాట్లాడుతూ ‘న్యాయవాదుల ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి రాష్ట్రస్థాయిలో ఐకాస ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని