వివేకా కేసులో జగన్‌ పాత్రపై విచారణ జరిపించాలి

వైఎస్‌ వివేకా హత్య కేసులో సీఎం జగన్‌ పాత్రపై విచారణ జరిపించాలని పెద్దాపురం తెదేపా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప డిమాండు చేశారు.

Updated : 03 Mar 2024 04:56 IST

పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

పెద్దాపురం, న్యూస్‌టుడే: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీఎం జగన్‌ పాత్రపై విచారణ జరిపించాలని పెద్దాపురం తెదేపా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప డిమాండు చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘రాజకీయ లబ్ధి కోసం వివేకానందరెడ్డిని కిరాతకంగా హత్య చేశారు. గొడ్డలివేటుతోనే బాబాయ్‌ చనిపోయారని సీఎం అంత కచ్చితంగా ఎలా చెప్పగలిగారు? సీబీఐ విచారణకు పిటిషన్‌ వేస్తానని సునీత అంటే జగన్‌ ఎందుకు ఆపారు? హత్య కేసులో సీబీఐ విచారణ కోరిన ఆయన.. తర్వాత వద్దనడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో ప్రజలకు చెప్పాల్సిందే. వివేకా ఎలా చనిపోయారో సీఎంకు తెలుసు, దానిని ఎందుకు దాచాలనుకుంటున్నారు? తండ్రిని హత్య చేసిన కేసులో తనకు న్యాయం చేయాలని సునీత పోరాడుతుంటే.. తమ్ముడిని సీబీఐ అరెస్టు చేయకుండా జగన్‌ అడ్డుకుంటున్నారు’ అని చినరాజప్ప విమర్శించారు. ఆమె పోరాటానికి తెదేపా అండగా నిలుస్తుందన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేసే పార్టీని కాకుండా అభివృద్ధి, సంక్షేమాన్నిచ్చే తెదేపా-జనసేన కూటమిని గెలిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని