Kakinada: వైకాపా అభ్యర్థికి.. అధికారం దాసోహం!

ఆయనకు ప్రభుత్వపరంగా ఏ హోదా లేదు. కానీ ఆయన పుట్టినరోజు వేడకల్లో కీలక శాఖలు అడుగడుగునా సహకరించి స్వామిభక్తి చాటుకున్నాయి. కాకినాడ వైకాపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ పుట్టినరోజు వేడుకలు సోమవారం భారీగా నిర్వహించారు.

Updated : 05 Mar 2024 09:32 IST

ఈనాడు, కాకినాడ: ఆయనకు ప్రభుత్వపరంగా ఏ హోదా లేదు. కానీ ఆయన పుట్టినరోజు వేడకల్లో కీలక శాఖలు అడుగడుగునా సహకరించి స్వామిభక్తి చాటుకున్నాయి. కాకినాడ వైకాపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ పుట్టినరోజు వేడుకలు సోమవారం భారీగా నిర్వహించారు. 20వేల మందికి మాంసాహార భోజనాలు పెట్టారు. జేఎన్‌టీయూకే ఎదురుగా వేదిక ఏర్పాటుచేసి హోర్డింగులతో హంగామా చేయడంతో జనాల రాకపోకలకు అసౌకర్యం కలిగింది. ట్రాఫిక్‌ చక్కదిద్దడానికి.. ప్రైవేటు కార్యక్రమానికి బందోబస్తుగా 50 మందికి పైగా పోలీసులు సేవలు అందించారు. జేఎన్‌టీయూ ప్రాంగణంలో వాహనాల పార్కింగ్‌ ఏర్పాటుచేయడంతో మైకుల హోరు, రణగొణ ధ్వనులతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. పార్కింగ్‌కు జేఎన్‌టీయూ యాజమాన్యం అనుమతివ్వడం విమర్శలకు తావిచ్చింది. ట్రాఫిక్‌ సమస్య నేపథ్యంలో డీఎస్పీ కోరడంతో సరే అన్నామని జేఎన్‌టీయూ వీసీ ప్రసాదరాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని