డీఎస్సీ సమయంలోనే ఏపీ సెట్‌.. ఆందోళనలో అభ్యర్థులు

డీఎస్సీ జరగనున్న సమయంలోనే ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోని డిప్యూటీ డీఈవో, ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఏపీ సెట్‌ ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Updated : 11 Mar 2024 09:24 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: డీఎస్సీ జరగనున్న సమయంలోనే ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోని డిప్యూటీ డీఈవో, ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఏపీ సెట్‌ ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్‌ 28న ఏపీ సెట్‌ ఉండగా.. ఏప్రిల్‌ 13న డిప్యూటీ డీఈవో స్క్రీనింగ్‌ పరీక్ష ఉంది. ఇదే సమయంలో ఏప్రిల్‌ 13 నుంచి 30 వరకు పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న స్కూల్‌ అసిస్టెంట్‌, టీజీటీ, పీజీటీ, ఫిజికల్‌ డైరెక్టర్‌ పరీక్షలు ఉన్నాయి. చాలా మంది అభ్యర్థులు డీఎస్సీతో పాటు డిప్యూటీ డీఈవో, ఏపీ సెట్‌కు సిద్ధమవుతుంటారు. డీఎస్సీ పరీక్షల్లో మార్పులు చేసిన విద్యాశాఖ.. ఇతర పరీక్షలు ఉన్న సమయాల్లోనే తేదీలను ప్రకటించడంతో వారంతా ఒత్తిడికి గురవుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రభుత్వం హడావుడిగా పరీక్షలను నిర్వహిస్తోందని పలువురు అభ్యర్థులు విమర్శిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని