సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్‌ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది.

Published : 28 Mar 2024 06:52 IST

పథకాలు అహో అనేలా 12 మందికి శిక్షణ.. నేడు జగన్‌తో భేటీ

ఈనాడు, కర్నూలు: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్‌ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. అయితే ఏ గ్రామంలో ఎవరు మాట్లాడాలో ఆ పార్టీ నాయకులు ముందుగానే ఎంపిక చేశారు. వివిధ పథకాల లబ్ధిదారులు 12 మందిని ఎంపిక చేసి, ఆయా పథకాల కారణంగా వారు లబ్ధి పొందారని చెప్పించడానికి రెండు రోజుల నుంచి ముమ్మర శిక్షణ ఇప్పిస్తున్నారు. ముఖ్యమంత్రిని కీర్తిస్తూ, పథకాల కారణంగా తమ జీవితం అద్భుతంగా మారిపోయిందని చెప్పించడానికి వీలుగా వారికి ఆళ్లగడ్డలో ఓ కీలకనేత ఇంట్లో శిక్షణ ఇచ్చి రిహార్సల్స్‌ కూడా చేయిస్తున్నారు. ఐప్యాక్‌ బృందం పర్యవేక్షణలో ఈ శిక్షణ కొనసాగుతోంది. సీఎం బస్సుయాత్రలో భాగంగా నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం ఎర్రగుంట్లలో రైతులతో ముఖాముఖీకి ఏర్పాటు చేస్తున్నారు. సీఎం భద్రత దృష్ట్యా ఎక్కడపడితే అక్కడి బస్సు దిగి మాట్లాడడం శ్రేయస్కరం కాదని.. ఎర్రగుంట్లలోనే అన్ని పథకాల లబ్ధిదారులతో మాట్లాడేయాలని పోలీసులు సూచించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని