ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?

‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు.

Published : 28 Mar 2024 05:43 IST

నూజివీడు ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు

ముసునూరు, న్యూస్‌టుడే: ‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. బుధవారం రాత్రి ముసునూరు మండలం రమణక్కపేట అరుంధతి కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. రెండేళ్లుగా మంచినీరు రావట్లేదని, సీసీ రహదారులు వేయలేదని, మురుగు కాలువలు లేక ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచికి, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఈ అయిదేళ్లలో తమ గ్రామం వైపు కన్నెత్తి చూసిన సందర్భాలు లేవని, గ్రామంలోని ప్రజలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని ఏ నాయకుడైనా అడిగారా? అని ప్రశ్నించారు. అభివృద్ధి చేయలేని నాయకులు తమకొద్దని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని