మంచం పట్టిన సేవానాయక్‌ తండా

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సేవానాయక్‌ తండాలో గన్యా జ్వరం విజృంభణతో స్థానికులు విలవిల్లాడుతున్నారు. 170 కుటుంబాలు ఉన్న ఈ తండాలో సుమారు 400 మంది నివసిస్తున్నారు.

Published : 28 Mar 2024 03:36 IST

పల్నాడు జిల్లాలో గన్యా విజృంభణ

వెల్దుర్తి, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సేవానాయక్‌ తండాలో గన్యా జ్వరం విజృంభణతో స్థానికులు విలవిల్లాడుతున్నారు. 170 కుటుంబాలు ఉన్న ఈ తండాలో సుమారు 400 మంది నివసిస్తున్నారు. ఇందులో 300 మందికిపైగా పది రోజులుగా జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. సేవానాయక్‌ తండా నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉంది. తండాలో పారిశుద్ధ్యం లోపించడం, అడవికి దగ్గరగా ఉండటంతో దోమల బెడద తీవ్రంగా ఉంది. వీటి కారణంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. శిరిగిరిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి థెరిస్సా మాట్లాడుతూ.. ఇప్పటికే రెండుసార్లు వైద్య శిబిరాలు నిర్వహించి అందరికీ మాత్రలు ఇచ్చామన్నారు. బాధితుల్లో గన్యా లక్షణాలు కనిపిస్తున్నా.. పరీక్షించడానికి తమ వద్ద నిర్ధారణ కిట్లు లేవన్నారు. సమస్య తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు, నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు