సాగునీరందక దెబ్బతింటున్న వరి

అప్పులు చేసి.. బంగారం తాకట్టు పెట్టి వరి సాగుకు పెట్టుబడి పెడితే సకాలంలో నీరందక పైరు దెబ్బతింటోందని, రుణం తీర్చే దారిలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం ఆయకట్టు గ్రాంటు పరిధిలోని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 28 Mar 2024 03:37 IST

పంట చేలో ద్విచక్ర వాహనాలు నడిపి రైతుల నిరసన

తాళ్లరేవు, న్యూస్‌టుడే: అప్పులు చేసి.. బంగారం తాకట్టు పెట్టి వరి సాగుకు పెట్టుబడి పెడితే సకాలంలో నీరందక పైరు దెబ్బతింటోందని, రుణం తీర్చే దారిలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం ఆయకట్టు గ్రాంటు పరిధిలోని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 200 ఎకరాలకు 20 రోజుల నుంచి నీరు అందక పొలాలు బీడుగా మారుతున్నాయన్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని పేర్కొంటూ పొలంలో ద్విచక్ర వాహనాలు నడిపి బుధవారం నిరసన తెలిపారు. శివారు భూములకు నీరందక అయిదేళ్ల నుంచి నరక యాతన పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. కలెక్టర్‌ను మంగళవారం కలిసి సమస్య వివరిస్తే బుధవారం ఉదయం 10 గంటలకే పొలాలకు నీరు చేరుతుందని జలవనరుల శాఖ ఎస్‌ఈ, ఈఈ హామీ ఇచ్చారన్నారు. అయినా ఫలితం లేకపోయిందని వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని