పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరేం?

‘నోటి కాడికి వచ్చిన పంట నిలువునా ఎండిపోతుంటే పట్టించుకోరా’ అని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరుకు చెందిన రమణమ్మ.. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిని బుధవారం ప్రశ్నించారు.

Published : 28 Mar 2024 04:59 IST

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిని  ప్రశ్నించిన మహిళ

సంగం, న్యూస్‌టుడే: ‘నోటి కాడికి వచ్చిన పంట నిలువునా ఎండిపోతుంటే పట్టించుకోరా’ అని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరుకు చెందిన రమణమ్మ.. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిని బుధవారం ప్రశ్నించారు. దువ్వూరులో బుధవారం ఆయన ప్రచారం చేస్తుండగా గ్రామస్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఎస్సీ కాలనీలో పర్యటిస్తున్న ఎమ్మెల్యేకు ఎదురుగా వెళ్లిన రమణమ్మ.. కనిగిరి జలాశయం వెనక ప్రాంతంలో వందలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోతున్నా పట్టించుకోరేమని అడ్డుకున్నారు. అడ్డుతప్పుకోవాలంటూ వైకాపా నాయకులు ఆమెను సముదాయించారు. సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చి ముందుకు కదిలారు. ఇదే కాలనీలో మరోచోట ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపించారు. రహదారులన్నీ గుంతలమయంగా మారినా పట్టించుకునే వారేలేరనీ వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని