పింఛన్ల పంపిణీపై ప్రచారం నిర్వహించకూడదు

ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన పింఛన్ల పంపిణీపై ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) స్పష్టం చేసింది.

Published : 28 Mar 2024 05:00 IST

గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన పింఛన్ల పంపిణీపై ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) స్పష్టం చేసింది. పంపిణీ చేసినట్టుగా ఫొటోలు, వీడియోలు కూడా తీయకూడదని వెల్లడించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని స్థాయిల అధికారులూ ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు మార్గదర్శకాలను బుధవారం జారీ చేసింది. ‘పింఛన్లు పంపిణీ చేసే వాలంటీర్ల పేర్లు, వారు అందజేసే నగదు మొత్తం వివరాలను ఎంపీడీవో/మున్సిపల్‌ కమిషనర్లు సంబంధిత రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌వో)కి అందజేయాలి. వాలంటీర్లకు సచివాలయం పేరు, నగదు వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలు అందించాలి. పంపిణీ చేసే సమయంలో వాటిని వాలంటీర్లు తమవద్దే ఉంచుకోవాలి. వాటిని పంచాయతీ కార్యదర్శులు, సంక్షేమ విద్యా సహాయకులు, వార్డు అడ్మిన్‌ కార్యదర్శి, వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులు కూడా అందుబాటులో ఉంచుకోవాలి. బ్యాంకుల నుంచి నగదు తీసుకునే సమయం నుంచి పింఛన్ల పంపిణీ పూర్తయ్యే వరకు ఇవి వారి వద్దనే ఉండాలి’ అని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని