వాలంటీర్లతో వైకాపా నాయకుడి రహస్య మంతనాలు

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా వాలంటీర్లతో విశాఖ తూర్పు వైకాపా నాయకుడు ఒకరు రహస్య సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

Published : 29 Mar 2024 03:38 IST

విశాఖపట్నంలో ఘటన

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ, మద్దిలపాలెం), న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా వాలంటీర్లతో విశాఖ తూర్పు వైకాపా నాయకుడు ఒకరు రహస్య సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. సీతమ్మధారలో ఆ నాయకుడికి చెందిన కల్యాణ మండపంలోనే గురువారం సాయంత్రం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే 16వ వార్డుకు చెందిన సుమారు 16 మంది వాలంటీర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారిని సదరు నాయకుడు సామూహిక రాజీనామాలు చేయాల్సిందిగా ఆదేశించారు. రాజీనామా చేసి నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని, తిరిగి అధికారంలోకి వచ్చాక అందరినీ విధుల్లోకి తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనకు వాలంటీర్లు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. సమావేశంపై కొందరు సీ-విజిల్‌కు సమాచారం అందించేలోపు అందరూ అక్కడి నుంచి జారుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని