తిరుపతి కలెక్టర్‌కు ఎన్నికల విధులు అప్పగించొద్దు

ఎన్నికల వేళ వైకాపా పంపిణీ చేసేందుకు తెచ్చిన తాయిలాలు శ్రీకాళహస్తిలో ఓ గోదాంలో దొరికినా తిరుపతి కలెక్టర్‌కు చీమకుట్టినట్లు కూడా లేదని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు.

Published : 29 Mar 2024 03:39 IST

తాయిలాల డంప్‌ బయటపడ్డా ఆయనకు చీమకుట్టినట్లైనా లేదు
సీఈఓకు ఫిర్యాదు చేసిన కూటమి నేతలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల వేళ వైకాపా పంపిణీ చేసేందుకు తెచ్చిన తాయిలాలు శ్రీకాళహస్తిలో ఓ గోదాంలో దొరికినా తిరుపతి కలెక్టర్‌కు చీమకుట్టినట్లు కూడా లేదని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని ఆయన చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయిందని గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముకేశ్‌ కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. జగన్‌కు విధేయుడిగా ఉన్న అతనికి ఎన్నికల విధులు అప్పగించవద్దని కోరారు. ఫిర్యాదు అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ‘‘వైకాపా అక్రమాలపై ఫిర్యాదులు చేయడమే రోజూ మాకు పనిగా మారింది. గతంలో ఫిర్యాదు చేస్తే పార్టీలు భయపడేవి. ఇప్పుడు జగన్‌రెడ్డి ఎవరినీ లెక్కచేయడం లేదు. తాయిలాల గోదాం విషయంపై ఫిర్యాదు చేయడానికి తిరుపతి కలెక్టర్‌ వద్దకెళ్తే మా అభ్యర్థన వినటానికి విమఖత చూపారు. వాలంటీరు వ్యవస్థకు తెదేపా, ఎన్డీయే వ్యతిరేకం కాదు. అధికారంలోకి వచ్చాక వారి సేవలు మెరుగ్గా వినియోగించుకుంటాం’’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హామీ ఇచ్చారు. భాజపా నేతలు పాతూరి నాగభూషణం, పార్థసారథి, జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ..ఎన్నడూ లేని విధంగా దేవాలయాల్లో పనిచేసే వారికీ ఎన్నికల విధులు విధులు కేటాయిస్తున్నారని, దీన్ని ఎన్డీయే ఖండిస్తోందన్నారు. నిబంధనలు బేఖాతరు చేస్తోన్న అధికారులపై సీఎస్‌ చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని