పాకశాస్త్ర కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న తిరుపతిలోని భారత పాకశాస్త్ర సంస్థ (ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌)లో వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ శిక్షణ, ప్లేస్‌మెంట్‌ అధికారి చెల్లేశ్వరరావు తెలిపారు.

Published : 29 Mar 2024 03:48 IST

తిరుపతి (గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న తిరుపతిలోని భారత పాకశాస్త్ర సంస్థ (ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌)లో వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ శిక్షణ, ప్లేస్‌మెంట్‌ అధికారి చెల్లేశ్వరరావు తెలిపారు. గురువారం కోర్సులకు సంబంధించిన బ్రోచర్లను వారు ఆవిష్కరించారు. భారత పాకశాస్త్ర సంస్థ తిరుపతిలో మాత్రమే ఉందని, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతీ, యువకులు కలినరీ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్లు వెల్లడించారు. తితిదే, ఐఆర్‌సీటీసీ, స్టార్‌ హోటళ్లు, పర్యాటక, తదితర శాఖ విభాగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. బీబీఏ, ఎంబీఏ కోర్సులతోపాటు నూతనంగా బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు అందుబాటులో ఉందన్నారు. ఇంటర్మీడియట్‌లో 50 శాతం ఉత్తీర్ణతతో కోర్సులో చేరవచ్చని.. ఏపీలోని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 99854 86271లో సంప్రదించాలని ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని