YSRCP: రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు.

Published : 29 Mar 2024 07:23 IST

సీతానగరం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. పంచాయతీ మాది.. నియోజకవర్గం మాది.. రాష్ట్రమే మాదంటూ ఎదురుతిరిగారు. నరసింహారావు ఎరువులు, పురుగు మందుల వ్యాపారం నిర్వహించడంతోపాటు పంచాయతీకి సంబంధించిన వివిధ పనుల్లో గుత్తేదారుగా ఉన్నారు. తన దుకాణ భవన సముదాయం మొత్తాన్ని వైకాపా రంగులతో నింపేసి సీఎం జగన్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. తన కుటుంబ సభ్యుల చిత్రాలు వేయించారు. గురువారం ఎన్నికల పర్యవేక్షక బృందాలు చూసి వాటిని తొలగించాలని ఆదేశించాయి. తొలగిస్తే ఊరుకునేది లేదు.. మళ్లీ మాదే అధికారం.. అనుమతులు తెచ్చుకుంటాం.. అంతవరకు ఆగలేరా అంటూ వాగ్వాదానికి దిగారు. రంగులు తొలగించకపోవడం, విధులకు ఆటంకం కలిగించడంపై అధికారులు సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని